ETV Bharat / bharat

ఉగ్రదాడిలో పోలీసు మృతి, మరో ఇద్దరికి గాయాలు - ఉగ్రవాదుల దాడి

జమ్ముకశ్మీర్​లో ఉగ్రమూకలు రెచ్చిపోయాయి. విధుల్లో ఉన్న పోలీసులపై కాల్పులు జరపగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.

Jammu Kashmir
జమ్ముకశ్మీర్
author img

By

Published : Aug 8, 2021, 12:19 AM IST

జమ్ముకశ్మీర్​లోని కుల్గామ్​ జిల్లాలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు మృతిచెందారు. మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అడిజన్ క్రాసింగ్​ వద్ద శనివారం ట్రాఫిక్​ను నియంత్రిస్తున్న సమయంలో ఈ దాడులకు తెగబడ్డారు ముష్కరులు.

ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు గాయాలపాలు కాగా, ఆస్పత్రికి తరలించే సమయంలో నిసార్ అహ్మద్​ అనే పోలీసు చనిపోయారు. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ముష్కరులు తప్పించుకు పారిపోయారని అధికారులు వెల్లడించారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. రద్దీ నేపథ్యంలోనే నష్ట తీవ్రతను తగ్గించేందుకు పోలీసులు సంయమనం పాటించినట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఉగ్రవాది హతం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.