ETV Bharat / sports

ఆర్సీబీ.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించగలదా? - కోహ్లీ కెప్టెన్సీ

ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించాలంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే ఫ్రాంచైజీ మాత్రం విరాట్​ను పక్కనపెట్టే నిర్ణయం తీసుకోదంటూ అందుకు గల కారణాలను వివరించారు క్రికెట్​ నిపుణులు.

kohli
కోహ్లీ
author img

By

Published : Nov 8, 2020, 3:15 PM IST

Updated : Nov 8, 2020, 4:34 PM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఐపీఎల్​లోనూ కప్​ గెలవకుండానే సీజన్ నుంచి నిష్క్రమించి నిరాశ పరిచింది. ట్రోఫీని సొంతం చేసుకోవాలనే కోరిక.. జట్టుకు, అభిమానులకు కలగానే మిగిలిపోయింది. దీంతో సోషల్​మీడియాలో జట్టుపై విపరీతంగా ట్రోల్స్​ వస్తున్నాయి. మరీ ముఖ్యంగా సారథి కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు గంభీర్​, సంజయ్​ మంజ్రేకర్​ సహా పలువురు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఈ గందరగోళ పరిస్థితుల నడుమ విరాట్​ను గద్దె దించి ఆ పగ్గాలను మరొకరికి ఫ్రాంచైజీ కట్టబెడుతుందా? అనేది ప్రస్తుతం క్రీడాభిమానుల మదిలో మెదులుతున్న అతిపెద్ద ప్రశ్న. అయితే ఆర్సీబీ.. కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించదని క్రికెట్​ నిపుణులు భావిస్తున్నారు. అందుకు గల కారణాలను వివరించారు?

kohli
కోహ్లీ

బ్రాండ్​ విలువ

విరాట్​ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్​ ప్రపంచానికి ఓ ఐకాన్​. ఎన్నో ఏళ్లుగా నిలకడైన ప్రదర్శన చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టీమ్​ఇండియాకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. 'ఫిట్​నెస్​ కా బాప్'​గా ఎంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచాడు. గత మూడేళ్లుగా బడా సెలబ్రిటీల్లో ఒకడిగా చలామణీ అవుతున్నాడు. 2019లో అతడి బ్రాండ్​ విలువ 237.5 డాలర్లు. విరాట్​కు ఉన్న క్రేజ్​ కారణంగానే జట్టుకు బడా సంస్థలు స్పాన్సర్​గా వ్యవహరిస్తున్నాయి. కాబట్టి అతడే లేకపోతే జట్టు విలువ పడిపోయే అవకాశముంది. కాబట్టి ఫ్రాంచైజీ విరాట్​ను కెప్టెన్సీ నుంచి తప్పించే అవకాశాలు లేనట్టే.

kohli
కోహ్లీ

ఫ్యాన్​ ఫాలోయింగ్​

కోహ్లీ.. తన అద్భుత ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు. ఇన్​స్టాలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల్లో ఒకడు. అతడి ఆట కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు. ఇప్పటివరకు ఐపీఎల్​లో ట్రోఫీని అందుకోలేక పోయినప్పటికీ సీఎస్కే, ముంబయి ఇండియన్స్​ తర్వాత ట్విట్టర్​లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న జట్టుగా ఆర్సీబీ నిలిచిందంటే అందుకు కారణం కోహ్లీనే.

బ్యాట్స్​మన్​

విరాట్​ కోహ్లీ.. ఐపీఎల్​లో సారథిగా విజయవంతం కాకపోయినప్పటికీ బ్యాట్స్​మన్​గా ఎన్నో అద్భుతాలు చేశాడు. బరిలో దిగితే పరుగుల వరద పారాల్సిందే. లీగ్​ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. 2016 సీజన్​లో ఏకంగా 973 పరుగులు చేసి జట్టును ఒంటిచేత్తో ఫైనల్​కు తీసుకెళ్లాడు.

ఇక ఈ లీగ్​లో ఆర్సీబీకి అభిమానులు ఉండటానికి మరో కారణం డివిలియర్స్​, కోహ్లీ జోడీ. అలాంటి బలమైన ద్వయం మళ్లీ తయారుచేయడం ఎంతో కష్టం. ఏదైనా కారణాల చేత కోహ్లీ మరొక జట్టుకు మారడం లేదా సారథిగా తప్పుకుంటే మాత్రం.. జట్టుకు ఉన్న ప్రేక్షకుల ఆదరణ అంతా పోయినట్లే. కాబట్టి విరాట్​ను కాదని సారథి పగ్గాలను మరొకరికి కట్టబెట్టే సాహసాన్ని ఫ్రాంచైజీ చేయదు.

kohli
కోహ్లీ

ఇదీ చూడండి కోహ్లీని కెప్టెన్​గా తప్పించాలనడం సరికాదు: సెహ్వాగ్

'కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలి'

Last Updated : Nov 8, 2020, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.