చిన్న ఘర్షణకు ప్రాణాలు బలి.. ఒక్కసారిగా కుప్పకూలి మృతి - ఉత్తర్​ప్రదేశ్ న్యూస్

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 14, 2022, 2:27 PM IST

youth died on the spot: చిన్న ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఇద్దరు అన్నాదమ్ములతో గొడవపడిన వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని సహరాన్​పుర్​లో జరిగింది. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. షానవాజ్ అనే వ్యక్తి తన పదేళ్ల కొడుకుతో కలిసి రాత్రి 10 గంటల సమయంలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో ఆసిఫ్ అనే వ్యక్తితో ఓ విషయమై గొడవపడ్డాడు. దీనిపై షానవాజ్.. ఆసిఫ్ సోదరుడికి ఫిర్యాదు చేసేందుకు అతడి దుకాణానికి వెళ్లాడు. అయితే, ఆసిఫ్ సోదరుడు సల్మాన్ సైతం షానవాజ్​పై దాడి చేశాడు. దాడికి గురైన వ్యక్తి ఒక్కసారిగా కింద పడిపోయి.. ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అన్నాదమ్ములిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.