ఫోన్ మాట్లాడుతూ మ్యాన్హోల్లో పడిన మహిళ- అదృష్టం కొద్దీ.. - పట్నా మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం
🎬 Watch Now: Feature Video
women fell manhole: ఓ మహిళ మ్యాన్హోల్లో పడిన ఘటన బిహార్లోని పట్నాలో గురువారం(ఏప్రిల్ 21) జరిగింది. అలమ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు.. సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిన బాధితురాలు రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్హోల్లో పడిపోయింది. వెంటనే ఆమెను పరిశీలించిన స్థానికులు, ప్రయాణికులు బయటకు తీశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. పట్నా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Last Updated : Apr 23, 2022, 6:41 PM IST