'పిల్లల్లో కరోనా వ్యాప్తి తక్కువేనని అంచనాలు చెప్తున్నాయ్' - పిల్లల్లో కరోనా న్యూస్
🎬 Watch Now: Feature Video
కరోనాపై విస్తృత పరిశోధనలు జరగాలని యూకే వైద్య నిపుణురాలు మాధవి పాలడుగు సూచిస్తున్నారు. వైద్య సమాజానికి అంతుచిక్కని సమస్యగా ఉన్న కోవిడ్ విషయంలో ఎన్నో చిక్కుముడులు ఉన్నాయని చెబుతున్నారు. పిల్లల్లో వైరస్ వ్యాప్తి తక్కువగా ఉందనే అంచనాలు ఉన్నాయని ఆ దిశగా పరిశోధించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లలకు వైరస్ సోకకుండా తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె సూచించారు. మరోవైపు విశ్వవిద్యాలయాలను కరోనా వ్యాప్తి కట్టడిలో వినియోగించుకోవాలని అంటున్న మాంచెస్టర్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ డీన్, పిల్లల వైద్య నిపుణురాలు మాధవి పాలడుగు... యూకే నుంచి ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడారు.