Prathidwani: రాష్ట్రంలో మత్స్యకారుల జీవితాలు ఎలా ఉన్నాయి? - మత్స్యకారుల జీవితాలపై నేటి ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15287607-149-15287607-1652541900110.jpg)
పైన ఆకాశం.. కింద సముద్రం! జీవితం మొత్తం ఆ మధ్యలోనే పోరాటం. ప్రస్తుతం ఆ మత్స్యకారుల జీవితాలు ఎలా ఉన్నాయి? వారి కుటుంబాలు ఎలాంటి పరిస్థితుల్లో రోజులు నెట్టుకొస్తున్నాయి...? మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా... ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేస్తున్నాం అంటోంది.. రాష్ట్ర ప్రభుత్వం. వారి భద్రతకు కట్టుబడి ఉన్నాం అంటున్నారు... ముఖ్యమంత్రి. మరి... క్షేత్రస్థాయిలో మత్స్యకారులకు ఈ ఫలాలు ఎంత వరకు అందుతున్నాయి? భరోసా సరే.. రాయితీపై వాహనాలు, వలలు, బోట్లు ఎంతమందికి అందుతున్నాయి? వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు చర్యలు ఎలా ఉన్నాయి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.