Prathidwani: ధాన్యం డబ్బు కోసం అన్నదాతల ఎదురుచూపులు..
🎬 Watch Now: Feature Video
కరోనా మహమ్మారి విలయానికి తోడు.. ప్రకృతి విపత్తులను తట్టుకుని రైతన్నలు పడిన శ్రమ తగిన ఫలితానికి నోచుకోవటం లేదు. ఆరుగాలం శ్రమించి అన్నదాతలు పండించిన ధ్యానాన్ని ప్రభుత్వానికి విక్రయించి రోజులు గడుస్తున్నాయే తప్ప... పంట డబ్బులు చేతికందటం లేదు. ఇల్లు గడవాలన్నా తర్వాతి సీజన్ కి సిద్ధమవ్వాలన్నా పెట్టుబడి అవసరమైన పరిస్థితుల్లో రైతులు ధాన్యం డబ్బుల కోసం దీనంగా ఎదురు చూస్తున్నారు. తప్పంతా కేంద్రానిదే అంటున్న రాష్ట్ర ప్రభుత్వం, నాబార్డు రుణాలతో కొంత. ఈ నెలాఖరుకు మొత్తం సమస్యను తీర్చుతాం అంటోంది. మరో వైపు ఖరీఫ్ సీజన్ తరుణంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి ఏంటి? బకాయిల ప్రభావం వారిపై ఎలా పడుతోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..