ప్రతిధ్వని: ధీమానివ్వాల్సిన బీమా పాలసీలతో దారుణాలా..? - prathidwani on insurance scam
🎬 Watch Now: Feature Video
తెలుగురాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి.. బీమాసురుల దారుణాలు. అమాయకుల్ని హతమార్చి.. ప్రమాదాలుగా చిత్రీకరించి కోట్లాది రూపాయల క్లెయిమ్‌లు పొందడం కలకలం రేపుతోంది. ప్రైవేటు బీమా ఏజెంట్లు.. కరడుగట్టిన హంతకులు, వారికి కొందరు అధికారులు జత కలసి చేసిన దురాగతాలు విస్తుపోయేలా చేస్తున్నాయి. వారికి కొందరు... బాధితుల కుటుంబసభ్యులు సహకరించడంతో గుట్టుగా సాగిపోతోంది.... ఈ దందా. ఎట్టకేలకు పోలీసులకు ఉప్పందడంతో.... కొంతమంది దుండగుల్ని కటకటాల వెనక్కు నెట్టారు. మరింత మంది కోసం గాలిస్తున్నారు. అసలు పరిస్థితి ఇంత వరకు ఎందుకు వచ్చింది? ధీమా ఇవ్వాల్సిన బీమాలోనే ఇన్ని దారుణాలు ఎందుకు? ఈ పెడ ధోరణుల్ని ఎలా అడ్డుకోవాలి? ఇదే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.