ప్రతిధ్వని: కోర్టు స్పందనతో చిగురించిన ఆశలు..కానీ పరిహారం దక్కేనా! - కరోనా పరిహారంపై ప్రతిధ్వని చర్చ
🎬 Watch Now: Feature Video
దేశంలో కరోనా విపత్తుకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య నాలుగు లక్షలకు చేరువైంది. వీరిలో అత్యధికులు పేద, మధ్యతరగతి ప్రజలే. కుటుంబ సభ్యుల వైద్యం ఖర్చుల కోసం ఆస్తులమ్ముకుని లక్షలాది మంది ఆర్థికంగా చితికిపోయారు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి వీధిన పడ్డవారూ అధికమే. వీరందరికీ పరిహారం చెల్లించి, ఆదుకోవాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలు, కోర్టు స్పందనతో అభాగ్యులందరికీ ఆశలు చిగురించాయి. కానీ పరిహారం ఇచ్చేంత సొమ్ము లేదంటూ, ఇప్పటికే వేర్వేరు రూపాల్లో సహాయం చేస్తున్నామంటూ కేంద్రం చెప్పిన సమాధానం.. కరోనా మృతుల కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లింది. కరోనా కాటుకు బలవుతున్న వారి కుటుంబాలను ఆదుకునే బాధ్యతను ప్రభుత్వాలు విస్మరించలేవంటూ సుప్రీం మరోసారి స్పష్టంగా ప్రకటించింది. విపత్తు సహాయక చట్టాలను సవరించైనా బాధితులకు అండగా నిలవాలని సూచించింది. ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.