Video: పూర్తయిన సంగం, పెన్నా బ్యారేజీలు.. ఆకట్టుకుంటున్న దృశ్యాలు - Penna River
🎬 Watch Now: Feature Video
నెల్లూరు జిల్లాలో సంగం, పెన్నా బ్యారేజీలు రోజురోజుకు కొత్త అందాలతో సుందరంగా కనిపిస్తున్నాయి. సంగం బ్యారేజి 1195 మీటర్లు పొడవు, 85 గేట్లతో నిర్మించారు. పెన్నా బ్యారేజి 650 మీటర్లు పొడవు, 57 గేట్లతో నిర్మించారు. ఈ రెండు బ్యారేజీల పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈనెల 6వ తేదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. పెన్నా నదిపై ఈ రెండు బ్యారేజీలు పూర్తి కావడంతో రైతులకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని అధికారులు చెబుతున్నారు. సంగం, పెన్నా బ్యారేజీల దృశ్యాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి.