కరోనాపై పోరులో ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం విధులు - ఎర్రచందనం స్మగ్లర్లు
🎬 Watch Now: Feature Video
కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నివారణలో భాగంగా.... ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం సైతం భాగస్వామ్యమవుతోంది. దాదాపు 400 మంది కార్యదళం సిబ్బంది.. చిత్తూరు, కడప జిల్లాల పోలీసులతో కలిసి విధులు నిర్వహిస్తున్నారు. లాక్ డౌన్ విధించేంత వరకూ శేషాచలం అడవుల్లో అత్యంత విలువైన ఎర్రచందనం వృక్షాల పరిరక్షణ కోసం కృషి చేసిన వీరంతా... ప్రస్తుతం ప్రజలు కరోనా బారిన పడకుండా పహారా కాస్తున్నారు. ఏప్రిల్ 14వరకూ పోలీసులకు తమ వంతు సహకారం అందిస్తూనే... మరో వైపు ఇంటెలిలెన్స్ వర్గాలతో సరిహద్దు రాష్ట్రాల వెంబడి స్మగర్ల కదలికలపైనా నిఘా వహిస్తామంటున్న ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం ఎస్పీ రవిశంకర్‌తో మా ప్రతినిధి శ్రీహర్ష ముఖాముఖి.
TAGGED:
ఎర్రచందనం స్మగ్లర్లు