పిల్లాడిని అతి దారుణంగా కరిచిన వీధి కుక్కలు.. శరీరంపై 40 గాయాలు! - రాజస్థాన్ న్యూస్
🎬 Watch Now: Feature Video

Dogs Bite Boy 40 places In Jaipur: రాజస్థాన్ జైపుర్‌లో దారుణం జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న 9ఏళ్ల బాలుడిని శునకాలు అతి దారుణంగా కరిచాయి. ముహానా పోలీసు స్టేషన్ పరిధిలోని బాలుడి ఇంటి ముందు ఈ ఘటన జరగగా.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బాలుడు తప్పించుకునేందుకు కారు వెనక్కి వెళ్లినా.. వీధి శునకాలు వదల్లేదు. వెంట పడి మరీ వేట కుక్కల్లా దాడి చేశాయి. మొత్తం ఐదు శునకాలు బాలుడిపై దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల్లో కనిపిస్తోంది. బాలుడిపై దాడిని గమనించిన ఇద్దరు మహిళలు.. శునకాలను అక్కడి నుంచి తరిమి చిన్నారిని రక్షించారు. అతడి శరీరంపై సుమారు 40 గాయాలను గుర్తించినట్లు వైద్యులు తెలిపారు.
Last Updated : May 27, 2022, 3:31 PM IST