ప్యాసింజర్​కు CPR చేసి ప్రాణాలు కాపాడిన జవాన్​​.. వీడియో వైరల్​! - చెన్నై ఎయిర్​పోర్ట్​ వార్తు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 26, 2022, 9:58 PM IST

Updated : Sep 26, 2022, 10:59 PM IST

తమిళనాడులోని చెన్నై విమానాశ్రయంలో గుండె నొప్పితో స్పృహతప్పి పడిపోయిన ఓ ప్రయాణికుడికి సీపీఆర్​ చేసి సీఐ​ఎస్ఎ​ఫ్​​ ప్రాణాలు కాపాడాడు. బంగాల్​కు చెందిన శేఖర్​ హజారా అనే వ్యక్తి.. చికిత్స నిమిత్తం చెన్నైకు ఆదివారం రాత్రి విమానంలో వచ్చాడు. అయితే విమానం దిగాక.. నడుచుకుంటూ వెళ్తున్న శేఖర్​కు ఒక్కసారిగా గుండె నొప్పి రావడం వల్ల ఎయిర్​పోర్ట్​లోనే కుప్పకూలి పడిపోయాడు. వెంటనే గమనించిన సీఐఎస్​ఎఫ్​​.. ప్రథమ చికిత్స అందించాడు. అనంతరం శేఖర్​ను తదుపరి చికిత్స నిమిత్తం అంబులెన్స్​లో అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం జవాన్​​ సీపీఆర్​ చేస్తున్న వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. వీడియో చూసిన పలువురు ప్రముఖులు.. సీఐఎస్​ఎఫ్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Last Updated : Sep 26, 2022, 10:59 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.