రూ 5 కోట్ల.. 55 లక్షల ..55 వేల.. కరెన్సీతో అమ్మవారు అలంకరణ
🎬 Watch Now: Feature Video
Mahalakshmi Ammavaaru in Mahabubnagar: తెలంగాణ రాష్ట్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ బ్రాహ్మణవాడలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు శుక్రవారం మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని రూ.5,55,55,555 విలువైన కరెన్సీతో అలంకరించారు. వాసవీమాత గర్భగుడిని, ఆలయ ప్రాంగణాన్నీ కరెన్సీ నోట్లు, నాణేలతో తీర్చిదిద్దారు. దీనిని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.