రాశి ఫలం: వృషభం - వృషభ రాశి
🎬 Watch Now: Feature Video
ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 6, అవమానం 1
వృషభ రాశివారికి ఈ సంవత్సరం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార సంబంధ లావాదేవీలకు ఈ ఏడాది అనుకూలంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. చార్టెడ్ అకౌంటెంట్స్కి ఈ ఏడాది బాగుంది. ఈ రాశివారు వివాహాది శుభకార్యాలకు చేసే ప్రయత్నాలు విసుగుపుట్టిస్తాయి. దైవానుగ్రహంతో మీ ప్రమేయం లేకుండానే మంచి సంబంధం దొరుకుతుంది. పది రూపాయల ఖర్చయ్యే చోట 20 రూపాయలు ఖర్చు చేసి శుభకార్యాలు ఘనంగా చేస్తారు. రాజకీయ వర్గాలకు చెందిన వ్యక్తులకు అనుకూలంగా ఉంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులతో కలిసి పనిచేస్తారు. సంవత్సర ద్వితీయార్ధంలో రెండు నెలలు వృత్తి, ఉద్యోగ పరంగా సంతృప్తిగా ఉండదు. నూతన భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. లాభాలుంటాయి. కుటుంబం, బంధువుల్లో ఏకాభిప్రాయం సాధించి ఎంతో కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించగలుగుతారు.