వైభవంగా ఇంద్రకీలాద్రిపై ఉగాది మహోత్సవాలు - దుర్గ గుడిలో ఉగాది మహోత్సవాలు
🎬 Watch Now: Feature Video
ప్లవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో సుప్రభాతం, స్నపనాభిషేకం, ప్రభాత అర్చన చేపట్టారు. హారతి సమర్పించిన అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం, ఉగాది పచ్చడి వితరణ, ప్రత్యేక పుష్పార్చనలు చేశారు. ఆలయంలో సిద్దాంతి లంకా వెంకటేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. గత ఏడాది మాయమైన నాలుగు వెండి సింహాల స్థానంలో కొత్త వాటిని చేయించి రథంలో ప్రతిష్టాపన చేశారు.