పుట్టపర్తిలో స్వర్ణరథంపై సత్యసాయి ఊరేగింపు - Satyasaibaba jola seva
🎬 Watch Now: Feature Video
అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్య సాయిబాబా 94వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రశాంతి నిలయంలోని గణేష్ ఆలయం వద్ద స్వర్ణరథంపై సత్యసాయి చిత్రపటాన్ని ప్రతిష్టించి పురవీధుల్లో ఊరేగించారు. సత్యసాయి రెండు దశాబ్దాల క్రితం పూర్ణచంద్ర ఆడిటోరియంలో జోలసేవ ద్వారా భక్తులకు కనువిందు చేసేవారు. ఈ సారి సాయి చిత్రపటానికి సాయికుల్వంత్ మందిరంలో జోలసేవ ఘనంగా నిర్వహించారు. గాయకులు మల్లాది బ్రదర్స్ సంగీత గానం చేశారు. మహసమాధిని భక్తులు పెద్ద సంఖ్యలో సందర్శించారు.