Terminal Part Collapsed at Rajahmundry Airport: రాజమండ్రి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ ఉక్కు గడ్డర్లు కూలిపోయాయి. ప్రస్తుతం వినియోగంలో ఉన్న టెర్మినల్ భవనాన్ని అనుకుని సుమారు 350 కోట్ల రూపాయలతో నూతన టెర్మినల్ నిర్మాణం జరుగుతోంది. క్రేన్ సాయంతో పనులు చేస్తున్న సమయంలో టెర్మినల్లో కొంత భాగం కుప్ప కూలింది. ప్రమాద సమయంలో ఇద్దరు కార్మికులకు గాయాలైనట్లు సమాచారం. గత నెలలో రాజమండ్రి విమానాశ్రయం నుంచి దిల్లీకి ఎయిర్ బస్సు సర్వీసును ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న టెర్మినల్ ఉక్కు గడ్డర్లు కుప్పకూలడంపై ఎయిర్ పోర్ట్ అధికారులు విచారణ చేస్తున్నారు. ప్రమాదంపై కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఆరా తీశారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే ఎయిర్‌పోర్ట్ అథారిటీ, పౌరవిమానయాన అధికారులతో మాట్లాడారు. ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
మహిళా బ్రేక్ ఇన్‌స్పెక్టర్ కు డిప్యూటీ కమిషనర్ బ్యాడ్ మెసేజ్లు - చితకబాదిన బంధువులు
విశాఖ నడిబొడ్డున ‘ఐటీ’కి ఐకానిక్ భవనం - 11 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలు