ETV Bharat / state

వల విసిరారు - బయటకు రప్పించారు! విజయవాడలో కలకలం సృష్టించిన మైనర్ బాలికల అదృశ్యం - FOUR MISSING GIRLS RESCUED

ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా మైనర్లకు మోసగాళ్ల వల - మాయమాటలతో బెంగళూరు, హైదరాబాద్‌ తరలించేందుకు యత్నం

Missing_Girls_Rescued
Four Missing Girls Rescued (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2025, 4:50 PM IST

Updated : Jan 24, 2025, 6:09 PM IST

Missing Girls Rescued by Vijayawada Police: విజయవాడలో నలుగురు మైనర్‌ బాలికల అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. అజిత్​సింగ్ నగర్​లోని కొత్త రాజరాజేశ్వరిపేటకు చెందిన ముగ్గురు మైనర్‌బాలికలు అదృశ్యం అయినట్లు రాత్రి 11 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. మరో ఘటనలో వీళ్లకు సంబంధం లేని మరో అమ్మాయి కూడా కనిపించడం లేదని ఫిర్యాదు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడిన పోలీసులు వేగంగా దర్యాప్తును ప్రారంభించారు. సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నలుగురు అమ్మాయిల కోసం గాలింపు చేపట్టారు.

కుటుంబ సభ్యుల నుంచి మైనర్‌ బాలికల వివరాలను సేకరించిన పోలీసులు, సోషల్ మీడియా ప్రభావంతోనే బాలికలు అదృశ్యం అయినట్లు గుర్తించారు. అదృశ్యం అయిన అమ్మాయిల్లో ముగ్గురికి దగ్గర బంధుత్వం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్న ఆగంతుకులే ఈ ముగ్గురు మైనర్‌ బాలికలను ఏక కాలంలో ప్రలోభపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వేగంగా పావులు కదిపిన పోలీసులు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ ప్రాంతంలో ముగ్గురు అమ్మాయిలను గుర్తించారు. వీరితో పాటు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. బాలికలను తెనాలి నుంచి ఇతర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లను ఆ ఇద్దరు యువకులు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మైనర్ బాలికలను తమ అదుపులోకి తీసుకున్న పోలీసులు, శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఆ బాలికలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అనంతరం అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తుల నుంచి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అమ్మాయిలను విజయవాడ నుంచి బెంగళూరు, హైదరాబాద్‌ ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు యత్నించినట్లు జరుగుతున్న ప్రచారంపై తాము దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ స్రవంతిరాయ్‌ తెలిపారు. అజిత్‌సింగ్‌నగర్‌ ప్రాంతంలోనే మరో బాలిక అదృశ్యమైనట్లు వచ్చిన ఫిర్యాదుపై కూడా గంటల వ్యవధిలోనే ఆ బాలిక ఆచూకి గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఒకే రోజులో నలుగురు మాయం: ఒకేరోజు రాత్రి నలుగురు బాలికల మాయంపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిగణలోకి తీసుకుని వారి ఆచూకీ గుర్తించారు. బాలికలను వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చినందుకు అజిత్‌సింగ్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శ్రీనివాస్‌తో సహా ఇతర సిబ్బందిని ఏసీపీ స్రవంతిరాయ్‌ అభినందించారు. ఇన్‌స్టాగ్రాంలో పరిచయంతో ముగ్గురు మైనర్‌ బాలికలకు గాలం వేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కిన ఇద్దరు వ్యక్తులను విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ రాజశేఖర్‌బాబు వద్దకు తీసుకెళ్లారు. బాలికలను తీసుకెళ్లడం వెనుక ఉద్దేశం ఏమిటి? వారి వెనుక ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడలో కలకలం సృష్టించిన మైనర్ బాలికల అదృశ్యం (ETV Bharat)

బడి ఎగ్గొట్టి బీచ్​కు వెళ్లిన హైదరాబాద్​ బాలికలు - ఎలా దొరికిపోయారంటే!

మేకలతో వెళ్లి అడవిలో తప్పిపోయిన వృద్ధురాలు - వారం రోజులు ఎలా గడిపిందంటే!

Last Updated : Jan 24, 2025, 6:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.