ప్రతిధ్వని: నెలవారీ విద్యుత్ బిల్లుల్లో... సర్దుబాట్లను సామాన్యులు మోయగలరా? - amaravathi news
🎬 Watch Now: Feature Video
అసలే కరోనా కష్టాలతో.. తీవ్ర అవస్థలు పడుతున్న సామాన్యుడిపై కొత్తగా అదనపు విద్యుత్ భారం పడనుందా..? ట్రూ అప్ ల పేరిట 2 వేల 542 కోట్ల రూపాయలను ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు ఏపీఈఆర్సీ ముందు డిస్కంలు తీసుకువచ్చిన ప్రతిపాదనల వెనుక ఆంతర్యం ఏమిటి..? రేపు జరగబోయే విద్యుత్ నియంత్రణ మండలి సమావేశంలో ఈ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి 3 నెలలకు ఛార్జీల సవరణకు అవకాశం కల్పిస్తూ తెచ్చిన రాజపత్రం పర్యవసనాలు ఎలా ఉండున్నాయి? కరోనా సంక్షోభ సమయంలో సామాన్యుడిపై, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై డిస్కంల ప్రతిపాదనలు ఎలాంటి భారం చూపించనున్నాయి...? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని చర్చ చేపడుతోంది.