ప్రతిధ్వని: రామాలయం భూమిపూజ చారిత్రక ఘట్టంపై చర్చ
🎬 Watch Now: Feature Video
అయోధ్యలో రామ మందిరం భూమిపూజ కనుల పండువగా జరిగింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ అమృత ఘడియలను కోట్లాది మంది హిందువులు భక్తి పారవశ్యంతో వీక్షించారు. భూమిపూజ అనంతరం ప్రసంగించిన ప్రధాని మోదీ... దేశమంతా రామమయం అయిందని అభివర్ణించారు. కోట్లాది మంది మనోసంకల్పానికి ప్రతీక రామమందిరం. పురుషోత్తముడికి భవ్య మందిర నిర్మాణం ప్రారంభమైందన్నారు. రాముని ఆదర్శాలు కలియుగంలో పాటించేందుకు రామ మందిరం మార్గం చూపిస్తోందన్నారు. రాముడి ప్రేరణతో భారత్ ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామాలయం భూమిపూజ చారిత్రక ఘట్టంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.