ప్రతిధ్వని: అందరికీ వ్యాక్సిన్లు.. ఎలాంటి సన్నద్ధత అవసరం? - కరోనా వైరస్ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
మే 1... దేశంలో 18ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ కోసం నిర్ణయించిన ముహూర్తం ఇది. కరోనా సెకండ్ వేవ్ ఉరుముతున్న తరుణంలో టీకా మినహా మార్గం లేదంటోంది శాస్త్రప్రపంచం. కేంద్రప్రభుత్వం కూడా అదే మాట చెబుతోంది. కానీ అనుకున్న లక్ష్యం చేరుకునేదెలా? వ్యాక్సిన్ నిల్వలు వేగంగా తరిగిపోతున్న పరిస్థితి ఒకవైపు ఆందోళన కలిగిస్తుంటే.. డిమాండ్ - ఉత్పత్తి మధ్య లోటు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నెల 28 నుంచి నమోదు.. మరో 5 రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్ననేపథ్యంలో అసలు దేశ వ్యాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత? ఉత్పత్తిపరమైన సవాళ్లను అధిగమించడం ఎలా? వందరోజుల అనుభవాల నుంచి.. అందరికీ వ్యాక్సిన్ దిశగా పంపిణీ పరంగా ఎలాంటి సన్నద్ధత అవసరం? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.