ప్రతిధ్వని: ఇంకా ఎంతకాలం.. ఈ ఇంటి నుంచి పని? - వర్క్ ఫ్రం హోమ్‌పై ఈటీవీ ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
వర్క్ ఫ్రం హోమ్. ఒకప్పుడు ఉద్యోగ వర్గాల్లో అదొక ఫ్యాన్సీ ట్రెండ్. కానీ ఇప్పుడదే మాట అడిగితే అవునూ అని చెప్పలేని పరిస్థితి. కరోనా పుణ్యమా అని ఏడాదికి పైగా ఇళ్లకే పరిమితమైన వేలాదిమంది ఉద్యోగులకు అదో బందిఖానా. కంపెనీలు ప్రొడక్టవిటీ పెరిగింది అంటుంటే... ఒత్తిడితో చిత్తైపోతున్నాం మహప్రభో అని ముఖాలు వేలాడేస్తున్నారు సాఫ్ట్‌వేర్ బాబులు. సంస్థల కోణం నుంచి.. ఉద్యోగుల కోణం నుంచి.. రోజుకొక సర్వే వారి సాధకబాధకాల్ని చర్చకు పెడుతున్నాయి. ఇంకా ఎంతకాలం.. ఈ ఇంటి నుంచి పని? అంచనాల మేరకు మరో ఏడాది ఇదే పరిస్థితి కొనసాగితే తర్వాత ఉద్యోగరంగం రూపురేఖలు ఎలా ఉంటాయి? అనే అంశంపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది..