Prathidwani Debate:వేతన సవరణపై ఇంత కాలయాపన ఎందుకు ?.. అసలు ఏం జరుగుతోంది ?
🎬 Watch Now: Feature Video
కార్యాలయాల్లో ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళనబాట పట్టారు. ఒకరో ఇద్దరో కాదు వేలాదిమంది.. తమ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉద్యమించారు. 11వ వేతన సవరణ, ఇతర సమస్య పరిష్కారాలే డిమాండ్లుగా కదం తొక్కుతున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని.. ప్రభుత్వ పెద్దలు పెట్టిన గడువులన్నీ దాటిపోయినా.. పట్టించుకునే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు. అసలు ఉద్యోగుల సంఘాలు ప్రభుత్వానికి నివేదించుకుంటున్న సమస్యల చిట్టా ఏమిటి? ఐదేళ్లసారి జరగాల్సిన వేతన సవరణపై ఇంత కాలయాపన ఎందుకు జరుగుతోంది? ఇన్ని ఆందోళనలు ఎందుకు చేయాల్సి వస్తోంది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..