ప్రతిధ్వని : పార్లమెంట్ సమావేశాలు... కీలక బిల్లులు! - ప్రతిధ్వని
🎬 Watch Now: Feature Video
సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాలపు సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొవిడ్ నేపథ్యంలో పలు ప్రత్యేకతలు, జాగ్రత్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మృతి చెందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సహా పలువురి సభ్యులు, ప్రముఖులకు ఉభయసభలు సంతాపం తెలిపాయి. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా జేడీయూ సభ్యుడు హరివంశ్ సింగ్ ఎన్నికయ్యారు. అక్టోబర్ ఒకటో తేదీ వరకూ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. కొవిడ్-19, ఆర్థిక వ్యవస్థ పతనం, నిరుద్యోగం, సరిహద్దుల్లో చైనా దురాగతం, జీఎస్టీ వసూళ్లు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు-కీలక బిల్లులపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది.