ప్రతిధ్వని: తెలుగునేలపై తొలి కరోనా కేసు నమోదై ఏడాది.. పోరాటం ఎలా సాగింది? - కరోనాపై ప్రతిధ్వని చర్చ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 2, 2021, 9:12 PM IST

తెలుగు నేలపై కరోనా మహమ్మారి పంజా విసిరి ఏడాది పూర్తైంది. గత ఏడాది సరిగ్గా ఇదే రోజుల్లో తెలుగునాట తొలి కరోనా కేసు నమోదైంది. ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసిన ఆ మహమ్మారి ఉభయ రాష్ట్రాలకు తీరని కష్టాన్ని మిగిల్చింది. ఎన్నో జీవితాలు తలకిందులయ్యాయి. ఎంతో మంది అయిన వాళ్లను కోల్పోయారు. సామాజికంగా, ఆర్థికంగా కనీవినీ ఎరుగని సవాళ్లు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎట్టకేలకు ఇప్పుడిప్పుడే ఆ కష్టాల నుంచి కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్‌ రాక, కేసుల తగ్గుదల కాస్తంత ఊరట కలిగిస్తున్నాయి. అయితే.. ఈ ఏడాది కాలంలో కరోనాపై మన పోరాటం ఎలా సాగింది..? వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన తరుణంలో అపోహలు అధిగమించి ఇకపై ఎలా ముందడుగేయాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.