వీవీఐటీలో ఘనంగా ముగిసిన 'బాలోత్సవ్' - నంబూరు వీవీఐటీలో బాలోత్సవ్
🎬 Watch Now: Feature Video
గుంటూరు జిల్లా నంబూరు వీవీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మూడు రోజులుగా జరుగుతున్న 'బాలోత్సవ్' ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పిల్లలు చేసిన సాంస్కృతిక, సాహితీ ఉత్సవం అందరినీ అలరించింది. మొత్తం 20 అంశాల్లోని 54 విభాగాల్లో విద్యార్థులు ప్రదర్శనలిచ్చారు. శాస్త్రీయ, జానపద నృత్యాలు చేసి చక్కని అభినయంతో ఆకట్టుకున్నారు. ముగింపు ఉత్సవానికి ఉపసభాపతి కోన రఘుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.