వరిరైతుకు అక్కరకు రాని రైతు భరోసా కేంద్రాలు.. ఎందుకు ఈ దైన్యం? - prathidwani on rbk centres in ap
🎬 Watch Now: Feature Video
పంట చేతికి వచ్చినా కొనేవారు ఎవరు?... ఇప్పుడు రాష్ట్రంలో వరిరైతుల పరిస్థితి ఇదే. కొండంత నమ్మకం పెట్టుకున్న రైతు భరోసా కేంద్రాలు అక్కరకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ధాన్యం గింజలపై దళారుల పంజా అన్న వార్తలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మద్ధతుధరకు నోచుకోక అన్నదాతలు విలవిల్లాడుతున్నారు. ఆర్బీకేలు మిల్లర్ల ఇష్టానికే వదిలేస్తున్నాయని వాపోతున్నారు. మరోవైపు నెలాఖరుకు ధాన్యం సేకరణ గడువు ముగియబోతున్నా.. ఖరీఫ్ లక్ష్యంలో 80% కూడా కాలేదు. మరికొన్నిచోట్ల రబీ పంట చేతికి వస్తున్నా.. ఖరీఫ్ సొమ్ములు ఇంకా అందలేదు. నెలల తరబడి బకాయిల కోసం ఎదురుచూపులు చూస్తునే ఉన్నారు. రాష్ట్రంలో ధాన్యం రైతులకు ఎందుకు ఈ దైన్యం?. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని..
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST