YSRCP Leaders Attacked Janasena Leader: ఇంటి మంజూరు విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు జనసేన నేతపై దాడి
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 8:13 PM IST
YSRCP Leaders Attacked Janasena Leader: రాష్ట్రంలో గత కొంత కాలంగా అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను ప్రశ్నించిన ప్రతిపక్షాలపై, సామాన్య ప్రజలపై వైసీపీ నేతలు తీవ్రంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసుల ఆధ్వర్యంలో దాడులు చేసి, దాడి చేసిన వారిపైనే అక్రమ కేసులు బనాయిస్తున్న సంఘటనలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. తాజాాగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లే గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసి భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇంటి మంజూరు విషయమై ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు జనసేన నాయకుడు మధుపై తీవ్రంగా దాడి చేశారు.
Janasena Leaders Fire on MLA Venkate Gowda: గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే వెంకటే గౌడను ఇంటి మంజూరు విషయమై.. జనసేన నేత మధు ప్రశ్నించారు. సంక్షేమ పథకాల జాబితాలో తమకు ఇళ్లు మంజూరు చేసినట్లు ఆధారాలు చూయిస్తున్నారని గానీ.. ఇంటి స్థలం ఎక్కడుందో మాత్రం చూపించటం లేదని నిలదీశారు. ఇష్టానుసారంగా ఇంటి స్థలాలను అమ్మేసుకుంటున్నారని, ఇంటి స్థలం చూపించాల్సిందేనని మధు, అతని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే వేంకటే గౌడ అక్కడి నుంచి వెనుతిరిగారు. ఈ క్రమంలో వైసీపీ అనుచరులు మధు, అతని కుటుంబ సభ్యులపై దాడి చేసి చితకబాదారు. దాడిలో మధు తలకు బలమైన గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు బైరెడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.