Attack on Hotel Staff: బిల్లు విషయంలో గొడవ.. హోటల్ నిర్వాహకులపై వైసీపీ నేతల దాడి..! - srcp leaders attack on Hotel Staff in adoni

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 26, 2023, 4:18 PM IST

Attack on Hotel Staff: కర్నూలు జిల్లా ఆదోనిలో హోటల్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు. దాడి చేసిన వారు వైసీపీ నాయకులని.. హోటల్ యజమాని తెలిపారు. తొలుత హోటల్​కి వచ్చిన కొంతమంది వ్యక్తులు.. ఫుడ్ ఆర్డడ్ చేసి తెప్పించుకున్నారు. తరువాత దానికి సంబంధించిన డబ్బులను ఆన్​లైన్ ద్వారా చెల్లించామని చెప్పారు. కానీ ఆ డబ్బులు తమకు రాలేదని హోటల్ సిబ్బంది చెప్పారు.  ఫుడ్​కి సరిపడా నగదు చెల్లించి.. ఆర్డర్ తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినవారు.. హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. హోటల్ యజమాని శ్రీనివాస్​, పలువురు సిబ్బందితో దురుసుగా ప్రవర్తిస్తూ.. వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో హోటల్ యజమానితో పాటు సిబ్బందికి గాయాలు అయ్యాయి. ఈ దృశ్యాలు అన్నీ సీసీ  కెమెరాలో రికార్డు అయ్యాయి. అయితే దాడి చేసినవారు వైసీపీ నాయకులని హోటల్ యజమాని చెప్తున్నారు. తమ తప్పు లేకున్నా గుంపుగా వచ్చి దాడికి పాల్పడ్డారని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.