అనంతపురంలో ఫ్లెక్సీల వివాదం- బ్యానర్లను చించేసిన మైనారిటీ కార్యకర్తలు - సామాజిక సాధికార యాత్ర
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-12-2023/640-480-20380473-thumbnail-16x9-ysrcp-flexy-dispute-two-factions-in-ananthapur.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 29, 2023, 10:11 AM IST
YSRCP Flexy Dispute Two Factions in Ananthapur: అనంతపురంలో వైఎస్సార్సీపీలోని రెండు వర్గాల మధ్య ఫ్లెక్సీల వివాదం చోటుచేసుకుంది. సామాజిక సాధికారిక బస్సు యాత్ర ముందు రోజే ఈ వివాదం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో నేడు బస్సు యాత్ర నిర్వహించనున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, ఆయన సోదరుడు అనంత చంద్రారెడ్డి చిత్రాలు పెద్ద సైజులో వేశారు.
రాష్ట్ర ఉర్దు అకాడమీ ఛైర్మన్ నదీమ్ అహమ్మద్ చిత్రం చిన్నగా ముద్రించడంతో మైనారిటీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం అర్హత లేని ఎమ్మెల్యే సోదరుడి ఫొటోలు పెద్దగా ముద్రించి క్యాబినేట్ హోదా కలిగిన నదీమ్ ఫొటోలు చిన్నగా ముద్రించడాన్ని తాము జీర్ణించుకోలేమన్నారు. దీంతో ఆగ్రహించిన మైనారిటీ కార్యకర్తలు నిమిషాల వ్యవధిలోనే బ్యానర్లను చించివేశారు. ఇటువంటి విపరీత పోకడలను తాము సహించేది లేదని నదీమ్ అభిమానులు, మైనారిటీ కార్యకర్తలు తీవ్ర హెచ్చరికలు చేశారు.