YSRCP Deleted Rushikonda Constrcutions Tweet: అంతా తూచ్.. రుషికొండపై నిర్మిస్తోంది సచివాలయం కాదు..! వైసీపీ మరో ట్విట్.. - Vizag Rushikonda Constrcutions
🎬 Watch Now: Feature Video
YSRCP Deleted Rushikonda Constrcutions Tweet: విశాఖ రుషికొండపై చేపట్టిన నిర్మాణంపై స్పందించిన వైసీపీ మరోసారి మాట మార్చింది. రుషికొండపై చేపట్టిన నిర్మాణాలు సచివాలయ భవనాలు కాదని మాట మార్చింది. రుషికొండపై నిర్మితమవుతున్న భవనాలు సచివాలయం అంటూ శనివారం సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేయగా.. అవి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలుగా పరిగణించాలని గంటల వ్యవధిలో మరో ట్విట్ చేశారు. 24 గంటలు గడవక ముందే ఇలా మాట మార్చటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ నిర్మాణాలపై వైసీపీ విమర్శలను ఎదుర్కోంటోంది. ఆ నిర్మాణాలు ఎంటనే విషయాన్ని ఇప్పటివరకు ప్రకటించలేదు. ఇప్పుడు ఇలా ప్రకటించి మాట మార్చింది. ఇకపోతే వైసీపీ శనివారం ట్వీట్టర్లో రుషికొండపై నిర్మాణం సచివాలయ భవనమని ధృవికరించిన ట్వీట్‌ను తొలగించింది. ఆ భవనాలను ఎందుకోసం నిర్మిస్తున్నారో మాత్రం స్పష్టం చేయలేదు. ఆ విషయాన్ని ఎక్కడా బహిరంగంగా ప్రకటించలేదు. ట్వీట్‌ను తొలగించటంపై ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. ఆ ట్వీట్‌ను ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించింది. భయంతో తొలగించారా.. లేక ముఖ్యమంత్రి నుంచి కోటింగ్ పడిందా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరింది.