కాకినాడ జిల్లాలో వైసీపీకి ఎదురుదెబ్బ - ఇద్దరు ఎంపీపీలు రాజీనామా
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 25, 2023, 4:07 PM IST
Yeleswaram MPP Resigns to YSRCP: కాకినాడ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో వేధింపులు అధికమయ్యాయని రాజీనామా చేసిన నేతలు ఆరోపించారు. వేధింపులు మాత్రమే కాకుండా అణచివేతకు గురి చేశారని.. ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ప్రత్తిపాడులోని ప్రజా ప్రతినిధులు వైసీపీకి రాజీనామా చేశారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి నరసింహ బుజ్జి.. పార్టీ సమన్వయకర్త పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక వైసీపీ ముఖ్య నాయకులు.. ఒక్క రూపాయి కూడా నిధుల నుంచి ఖర్చు చేయనిచ్చేవారు కాదని ఆరోపించారు. నిధులను నిలిపివేసి యంత్రాగాన్ని భయభ్రాంతులకు గురి చేసేవారన్నారు.
పార్టీని నమ్ముకున్నాం కాబట్టి మాపై వచ్చిన వేధింపులను పెద్దల దృష్టికి తీసుకెళ్లామని.. కానీ తాము అవసరం లేదని విధంగా వైసీపీ వ్యవహరించిందని అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. వైసీపీలో వేధింపులు అధికంగా ఉన్నాయని రౌతలపూడి ఎంపీపీ రాజ్యలక్ష్మి ఆరోపించారు. అంతేకాకుండా అణచివేతకూ గురైనట్లు వివరించారు. ఈ కారణంగానే ఆమె కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.