టీడీపీలోకి వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు - చర్చనీయాంశంగా మోపిదేవి ప్రధాన అనుచరుడి పార్టీ మార్పు - టీడీపీలో చేరిన వైసీపీ నేత నర్రా సుబ్బయ్య

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 19, 2023, 12:47 PM IST

YCP ZPTC Joined TDP in Presence of Satya Prasad: బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం వైసీపీ జడ్పీటిసీ సభ్యుడు నర్రా సుబ్బయ్య టీడీపీలో చేరాడు. ఎంపీ మోపిదేవి వెంకట రమణారావుకు ప్రధాన అనుచరుడిగా ఉన్న సుబ్బయ్య పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. విశాఖపట్టణంలో జరిగిన యువగళం పాదయాత్రలో ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ సమక్షంలో సుబ్బయ్య పార్టీ జెండా కప్పుకున్నాడు. గత టీడీపీ హయాంలో సుబ్బయ్య భార్య నాగమణి నిజాంపట్నం మండలం వైసీపీ ఎంపీపీగా పని చేశారు. అప్పట్లో వైసీపీ అధికారంలో లేకపోయినా పార్టీని నమ్మి పని చేశారు. 

పార్టీ తరపున ఏ కార్యక్రమం ఉన్నా ముందుండి నడిపించేవారు. మోపిదేవికి ప్రధాన అనుచరుడిగా ఉండి ఒక్కసారిగా పార్టీ మారడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే వ్యక్తిగత కారణాలతోనే వైపీపీకి, పదవిని వదిలి టీడీపీలోకి మారినట్లు సుబ్బయ్య తెలిపారు. అదే విధంగా రేపల్లె వైసీపీ నూతన సమన్వయకర్తగా ఈవూరు గణేష్​ను నియమించడంపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. మోపిదేవికి కాదని రేపల్లె నియోజకవర్గ పార్టీ బాధ్యతలు గణేష్​కు అప్పగించడంతో వైసీపీ నుంచి బయటికి వచ్చినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.