బాలినేని సూచించిన వ్యక్తికే సంతనూతలపాడు టికెట్ ఇవ్వాలి: వైసీపీ నేతలు - YSRCP MLA Candidates Confusion
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 19, 2023, 10:37 PM IST
YCP Workers on Santanutalapadu Ticket: ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతనూతలపాడు టికెట్‌కు సంబంధించి వైసీపీ నేతలు, కార్యకర్తలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సంతనూతలపాడు టికెట్ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఒంగోలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించిన వ్యక్తికే సంతనూతలపాడు టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేశారు. బాలినేని చెబితేనే అధిష్ఠానం నియమించిన అభ్యర్థి విజయానికి తాము పని చేస్తామని వైసీపీ నేతలు తేల్చిచెప్పారు.
YCP Workers Comments: ''సంతనూతలపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరైనా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిప్రాయం మేరకే అభ్యర్థిని ప్రకటించాలి. ఆయన ఎవరికీ చేయమని చెప్పితే, వారికే పని చేస్తాం. జిల్లాలో పార్టీ ఆగ్రనేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆయన చెప్పినట్లుగానే మేమంతా నడుచుకుంటున్నాం. మా ప్రత్యర్థులను ఓడించి మళ్లీ వైసీపీ జెండాను ఎగరవేయడానికి మేమంతా సిద్దంగా ఉన్నాం. అయితే, బాలినేని శ్రీనివాస్ రెడ్డి సూచించిన అభ్యర్థికే టికెట్ ఇవ్వాలని మేమంతా పార్టీ అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాలినేని అభిప్రాయాన్ని తీసుకోవాలని కోరుతున్నాం'' అని సంతనూతలపాడు నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు వారి అభిప్రాయాన్ని మీడియా ముందు వ్యక్తం చేశారు.