YCP Tweet on Visakha Rushikonda Constructions: విశాఖ రుషికొండ నిర్మాణాలపై.. వైసీపీ క్లారిటీ.. - విశాఖ రుషికొండ నిర్మాణంపై వైసీపీ ట్వీట్
🎬 Watch Now: Feature Video
YCP Tweet on Visakha Rushikonda Constructions: విశాఖ రుషికొండలోని నిర్మాణాలపై అసలు నిజాన్ని అధికార ట్వీట్ ద్వారా వైసీపీ బయటపెట్టింది. రుషికొండపై జరుగుతున్న నిర్మాణం సచివాలయం అంటూ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించింది. విశాఖ పాలనా రాజధానిగా ప్రకటించి.. సచివాలయం నిర్మాణం జరుగుతోందని తెలియజేసింది. సచివాలయ నిర్మాణానికి మీకున్న అభ్యంతరాలు ఏంటి అంటూ తెలుగుదేశం, జనసేనను ప్రశ్నించింది. ఇప్పటివరకూ ఆ నిర్మాణాలపై రోజుకో మాట చెప్పిన వైసీపీ.. ఇప్పుడు దానిని సచివాలయం కోసం చేపడుతున్న నిర్మాణంగా పేర్కొనడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక శాఖ కోసం నిర్మిస్తున్న భవనాలు అని ఒకసారి.. ప్రభుత్వ అతిథిగృహం అని మరోసారి అధికార వైసీపీ పార్టీ చెప్పుకొచ్చింది. అసలు ఇక్కడ ఏ నిర్మాణాలు జరగడం లేదని అలాంటిదేమి లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సచివాలయం కోసం చేపట్టిన నిర్మాణం అంటూ పేర్కొనడం.. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని స్పష్టమవుతోంది.