YCP Sarpanch fire on Leaders: అభివృద్ధి పనులకు నిధులేవి..? తిరుపతి జిల్లాలో వైసీపీ సర్పంచి కంటతడి - వైసీపీ సర్పంచి కంటతడి వీడియో
🎬 Watch Now: Feature Video
YCP Sarpanch Fires on Jagan Govt: తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో వైసీపీ సర్పంచి విజయలక్ష్మి అభివృద్ధి పనులు చేయలేక పోతున్నామని కంటతడి పెట్టుకుంది. ఈ కారణంగా తెలుగు దేశం వర్గాలు హేళన చేస్తున్నారని వాపోయింది. లక్షలు ఖర్చు పెట్టి సర్పంచి అయితే.. తమకు అండగా ఉండే నాయకుడు లేరని నిలదీసింది. వెంకటగిరికి సీఎం పర్యటన రోజు.. తాను 350 మందిని తన పంచాయతీ కె ఉప్పరపల్లి నుంచి తీసుకొస్తే వాళ్లకు కనీసం భోజనాలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నియోజక వర్గ నాయకుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి దగ్గరకు పోతే ఆయన మాతో పలకరని రోదించింది. ఇక సర్పంచి ఎందుకు డబ్బులు ఖర్చు చేసి గెలవటం అని అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతోపాటు కొందరి భూ సమస్యలపై వెళ్తే.. రెవెన్యూ అధికారులు పట్టించు కోవడం లేదని వైసీపీ సర్పంచి విజయలక్ష్మి తన ఆవేదన వెళ్లగక్కారు.