ఇదేందయ్యా ఇదీ!? రోడ్డుకు అడ్డంగా గోడ కట్టించిన వైసీపీ నేత - Irregularities leaders
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 3:18 PM IST
YCP Leaders Built a Wall Across the Road : వైసీపీ నాయకుల అరాచకాలు రోజు రోజుకి మితిమీరుతున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం దోప్పలపూడిలో ఓ వైసీసీ నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించారు. స్థానికంగా ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇంటి ముందు నిర్మించిన మెట్లను తొలగించాలని సూచించాడు. సదరు ఉద్యోగిని కొంత భాగం తొలగించి, మరికొంత భాగాన్ని వదిలేసింది. మిగిలిన భాగాన్ని కూడా తీసివేయాలని చెప్పినా వినకపోవడంతో, ఆగ్రహంతో రోడ్డుకు అడ్డంగా గోడను నిర్మించాడు. ఈ చర్యతో స్థానికులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చిన ఆ పరిణామాల ప్రభావం తమపై ఉంటుుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులే ఈ సమస్యను తీర్చాలని వారు వేడుకుంటున్నారు.
తమ పార్టీనే కదా అధికారంలో ఉందని తాము ఏం చేసిన ప్రశ్నించారని ధీమాతో అక్రమాలకు, దౌర్జన్యాలకు, బెదిరింపులకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు. అధికార నాయకులు ఇచ్చే బహుమానాలు తిరస్కరిస్తే పింఛను నిలిపివేయడం, ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరులని తెలిస్తే ఓట్లును గల్లంతు చెయ్యడం, వైసీపీ నేతల మాటలు వినకపోతే రోడ్డుకు అడ్డంగా గోడను కట్టేస్తున్నారు. రాష్ట్రంలో ఇన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్న అధికారులు మాత్రం వైసీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.