YSRCP Leader Attack on Farmer: భూ వివాదం.. కౌలురైతుపై వైఎస్సార్సీపీ నేత కత్తులతో దాడి - కౌలు రైతుపై వైసీపీ నాయకుడు కత్తులతో దాడి
🎬 Watch Now: Feature Video
YSRCP Followers Attacks on Tenant Farmers : గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు పెట్రేగిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నాయకుల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. ఈ తరుణంలో ఓ వైఎస్సార్సీపీ నాయకుడు కౌలు రైతు దంపతులపై తన ప్రతాపాన్ని ప్రదర్శించాడు. కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశాడు.
బాపట్ల జిల్లా చుండూరుపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ నేతలు తమపై కత్తులతో దాడికి పాల్పడ్డారని కౌలు రైతు పెరుగుమోలు సతీష్ బాబు దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. అదే గ్రామానికి చెందిన జేష్ట నాగ వంశీకృష్ణ నుంచి నాలుగున్నర ఎకరాల పొలాన్ని పెరుగుమోలు సతీష్ బాబు కౌలుకు తీసుకున్నాడు. పొలం కౌలుకు తీసుకుని అగ్రిమెంట్ రాసుకున్న తరువాత ట్రాక్టర్‌తో పొలం దున్నడానికి వెళ్లాడు. ఆ సమయంలో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ జేష్ట అంకమ్మ చౌదరి పొలం వద్దకు చేరుకోని సతీష్ బాబుపై కత్తులతో దాడి చేశాడు. అడ్డుపడిన అతని భార్య రాహేన్పైనా కూడా దాడి చేశారు. వారి చెర నుంచి తప్పించుకోని రోడ్డుపైకి చేరుకున్నారు. ఈ దాడిలో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరిని గమనించిన స్థానికులు బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు.
పొలం వివాదం: చుండూరుపల్లి గ్రామానికి చెందిన నాగ వంశీ కృష్ణ, అతని సోదరుడు వైఎస్సార్సీపీ నేత అంకమ్మ చౌదరికి నాలుగున్నర ఎకరాల పొలం విషయంలో వివాదం నడుస్తోందని పోలీసులు చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటున్న వంశీ పొలాన్ని సతీష్‌కు కౌలుకి ఇవ్వడంతో సోదరుడు అంకమ్మచౌదరి ఈ దాడికి పాల్పడ్డాడని వారు తెలిపారు. అంకమ్మ చౌదరి, ఆయన కుమారుడు ఈ దాడికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.