YCP Corporators Meet SP: లేడీ కానిస్టేబుల్‌ను బలి చేయడానికి ముమ్మరయత్నాలు.. ఎస్పీను కలిసిన వైసీపీ కార్పొరేటర్లు.. - లేడీ కానిస్టేబుల్‌ను బలి చేయడానికి ముమ్మరయత్నాలు
🎬 Watch Now: Feature Video
YCP Corporator Huchul In SEB police Station: అనంతపురం జిల్లాలో సెబ్ పోలీస్ స్టేషన్‌పై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనలో బాధితురాలైన మహిళా కానిస్టేబుల్‌ను బలి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానిస్టేబుల్ రాధమ్మ ఫిర్యాదులో దాడి చేసిన వారి వివరాలను పొందుపరిచినా.. అధికార పార్టీ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిళ్లతో వారిని కేసు నుంచి తప్పించారు. కేసును ఉపసంహరించుకోవాలని రాధమ్మకు ఓ రాజకీయ పార్టీని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారు. అయితే ఈ క్రమంలో శనివారం ఎస్పీని కలిసి లేడీ కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్లు కోరారు. దీంతో పక్కా వ్యూహంతోనే అధికార పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. లేడీ కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ దీనిపై పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.