Women Protest to Remove Liquor Shop: మద్యం షాపును తొలగించాలని.. గ్రామస్ధుల ధర్నా.. ! - Agadas of drug addicts in Pulletikurru

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 23, 2023, 10:46 PM IST

Women Protest to Remove Liquor Shop: మోటార్ సైకిళ్లు అడ్డుగా పెట్టి మద్యం సీసాలు చేతపట్టి మహిళలను, యువతులను మందుబాబులు ఇబ్బంది పెడుతుండటంతో మద్యం దుకాణాన్ని మరో ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు ఆందోళన చేసిన ఘటన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో మద్యం దుకాణాన్ని తొలగించాలని మహిళలు యువతులు గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. గ్రామంలోని వీవర్స్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి చెంతన ఉన్న మద్యం దుకాణాన్ని ఊరి చివరకు తరలించాలని మహిళలు గ్రామస్థులు శనివారం సాయంత్రం ఆందోళనకు దిగారు. స్థానికంగా ఉన్న ప్రధాన రహదారిపై మందుబాబులు మోటార్ సైకిల్ నుంచి వాటిపై కూర్చుని మద్యం సేవిస్తూ అటుగా వెళ్లే మహిళల పట్ల యువతులు పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్థులు మద్యం దుకాణం ముందు ధర్నాకు దిగారు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. వెంటనే ఆ మద్యం దుకాణాన్ని వేరే చోటుకి తరలించాలని లెకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.