భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన వైసీపీ నేతలు - అడ్డుకున్న మహిళలు - Land occupation by YCP leaders in NarasaRaopet
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 14, 2023, 1:23 PM IST
Women Stopped YCP Leaders Land Encroachment: పల్నాడు జిల్లా నరసరావుపేటలో కొందరు వైసీపీ నాయకులు బరితెగించారు. బరంపేట కాపు ఆరామక్షేత్రం వద్ద ఉన్న సుమారు కోటి రూపాయల విలువైన ఆరున్నర సెంట్ల పోరంబోకు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారని స్థానిక మహిళలు ఆరోపించారు. కబ్జాదారుల ఆధ్వర్యంలో జేసీబీతో స్థలాన్ని చదును చేస్తుండగా మహిళలు అడ్డుకున్నారు.
ఇళ్ల నిర్మాణానికి మట్టి తోలించుకుని కాపాడుకుంటున్న స్థలాన్ని కొందరు వైసీపీ నేత పేరు చెప్పుకుని ఆక్రమించేందుకు యత్నించారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ఆదేశాలతో జేసీబీతో స్థలాన్ని చదునుచేసేందుకు యత్నించారని ఆరోపించారు. ఎప్పటికైనా నివాసం ఏర్పాటు చేసుకుందామనుకుంటే కొందరు వైసీపీ నేతలు ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. తాము అడ్డుకోవడంతో వాళ్లు జేసీబీతో సహా జారుకున్నారని తెలిపారు. గత 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న స్థలం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని, దయచేసి అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని మహిళలు వేడుకుంటున్నారు.