Woman Volunteer for financial assistance: సీఎంను కలిసి ఆర్థిక సాయం కోరాలని మహిళా వాలంటీర్ నిరీక్షణ.. కానీ

🎬 Watch Now: Feature Video

thumbnail

Anakapalli District Women volunteer placards for financial assistance: అనకాపల్లి జిల్లా పద్మనాభంకి చెందిన ఓ మహిళా వాలంటీర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసి.. క్యాన్సర్‌తో బాధపడుతున్న తనకు ఆర్ధిక సహాయాన్ని ఆర్జించేలా అధికారులు అవకాశం కల్పించాలంటూ.. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం గేటు వద్ద ప్లకార్డులతో నిరీక్షించింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు.. సీఎం జగన్‌ను కలిసేందుకు ఇది సరైన మార్గం కాదని, ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపోవాలంటూ సూచించారు. దీంతో చేసేదేమీ లేక ఆ మహిళ వాలంటీర్.. తన భర్తతో సహా అక్కడి నుంచి వెళ్లిపోయింది.  

ముఖాముఖి సమావేశం ఊసేత్తని సీఎం జగన్..  విశాఖ పర్యటనలో సీఎం జగన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇనార్బిట్‌ మాల్‌కు శంకుస్థాపన చేసిన జగన్.. అక్కడే జీవీఎంసీ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సంబంధించిన శిలాఫలకాలు ఆవిష్కరించారు. ఆ తర్వాత 134 కోట్ల రూపాయలతో చేపట్టే.. 47 పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆంధ్ర విశ్వ విద్యాలయానికి చేరుకున్న సీఎం.. 130 కోట్ల రూపాయల వ్యయంతో విద్యార్థులకు ఉపయుక్తంగా అభివృద్ధి చేసిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యార్ధులతో ముఖాముఖి సమావేశం ఉంటుందని ముందుగా ప్రకటించినప్పటికీ.. ఆ ఊసేలేకుండా సీఎం జగన్ విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిపోయారు. 

Last Updated : Aug 2, 2023, 6:22 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.