Wild Buffalo Hulchal: అల్లూరి జిల్లాలో అడవి దున్న హల్చల్.. వేటగాళ్ల బారిన పడి కుంటుకుంటూ.. చివరకు లోయలో పడి మృతి - అడవి దున్న న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 12:11 PM IST
|Updated : Oct 7, 2023, 12:20 PM IST
Wild Buffalo Hulchal: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి - రంపచోడవరం ప్రధాన రహదారిలో శుక్రవారం ఓ అడవి దున్న హల్చల్ చేసింది. బాణం గుచ్చుకున్న అడవి దున్న కుంటుతూ.. రోడ్డుపైకి వచ్చింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుకు ఇరువైపులా కాసేపు వాహనాలు నిలిచిపోయాయి. వేటగాళ్ల బారిన పడిన అడవి దున్న.. చివరకు పక్కనే ఉన్న లోయలో పడి మృతిచెందింది. దీనిపై స్థానికులు.. అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అధికారులు.. అడవి దున్నను పరిశీలించారు. వేటగాళ్లు.. ఆ అడవి దున్నపై నాలుగు బాణాలు వేసినట్లు గుర్తించారు. మారేడుమిల్లి నుంచి రంపచోడవరం వెళ్లే రహదారిలో అడవి దున్నల సంచారం ఎక్కువగా ఉందని, ఇదే అదునుగా వేటగాళ్లు వాటిని చంపుతున్నారని స్థానికులు చెప్తున్నారు. శనివారం దానికి పంచనామా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం వన్యప్రాణి వారోత్సవాలు జరుపుతున్న నేపథ్యంలోనే జంతువులకు రక్షణ లేకుండా పోయిందని పలువురు జంతు ప్రేమికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. జంతువులను చంపవద్దంటూ గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.