ఈ నెల 23 నుంచి టీ20 సిరీస్ - సింహాద్రి అప్పన్న సేవలో వీవీఎస్ లక్ష్మణ్​ దంపతులు - సింహాద్రి అప్పన్న ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 21, 2023, 12:52 PM IST

VVS Laxman Couple Visited Simhadri Appanna Swamy Temple: భారత మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్ దంపతులు విశాఖ సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. సోమవారం రోజున వీరు స్వామివారిని దర్శించుకోగా.. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాలను అందించారు. ఆలయాధికారులు వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత బేడా ప్రదక్షణ చేశారు. లక్ష్మణ్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో వీరికి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్​ మూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్​ పాల్గొన్నారు.

ఈ నెల 23 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల (T20 Series) టీ20 సిరీస్‌కు.. భారత జట్టుకు ప్రధాన కోచ్‌గా భారత మాజీ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్  వ్యవహరించనున్నారని సమాచారం. ఈ సిరీస్​లో మొదటి మ్యాచ్​ విశాఖపట్నంలో ప్రారంభంకానుంది. ఇప్పటికే సూర్య కుమార్​ యాదవ్ కెప్టెన్​గా.. భారత క్రికెట్​ జట్టును బీసీసీఐ ప్రకటించింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.