లోకేశ్ యువగళం పాదయాత్ర - వెన్నుదన్నుగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థ - yuvagalam volunteers on lokesh
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 18, 2023, 8:47 PM IST
Volunteer System Leads Main Role in Lokesh Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా సాగేందుకు వాలంటీర్ వ్యవస్థ రక్షణ దళంగా నిలిచింది. తమ అభిమాన నాయకుడు చేపట్టిన పాదయాత్రను విజయం సాధించడానికి వాలంటీర్ల పాత్ర ఎనలేనిది. రోప్ పార్టీ సమన్వయం మొదలు పాదయాత్రలో పాల్గొని తిరిగి లోకేశ్ క్యాంప్ సైట్లో బస్సు ఎక్కే వరకు ఎక్కడ కూడా ఏ సమస్య రాకుండా యువగళం వాలంటీర్ బృందం వెన్నుదన్నుగా నిలిచింది. పాదయాత్రలో లోకేశ్‌తో పాటు సాగే బృందానికి సమయానికి ఆహ్వానం అందించడం, వారికి ఆహారం అందించడం, రాత్రి వసతి సమకూర్చటం, క్యాంప్ సైట్ ఏర్పాటు వంటివి పర్యవేక్షించేందుకు వివిధ బృందాలు వాలంటీర్ వ్యవస్థ కలిసికట్టుగా పనిచేశారు. లోకేశ్ చేపట్టిన పాదయాత్రను బృంద సభ్యులు జైత్ర యాత్రలా మలిచారు. ఎక్కడ కూడా ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా యువగళం పాదయాత్ర నేడు దిగ్విజయం పూర్తి చేసుకుంది అంటే అందులో వాలంటీర్ల పాత్ర ఘనమైనదే. యువగళం పాదయాత్రపై వాలంటీర్ సభ్యుల స్పందన ఇప్పుడు చూద్దాం.