Volunteer Belt Shop in Tadepalli : తాడేపల్లిలో బెల్ట్‌షాప్ నిర్వహిస్తున్న వాలంటీర్.. సోషల్ మీడియా గ్రూపులు పెట్టి మద్యం డెలివరీ
🎬 Watch Now: Feature Video
Volunteer Belt Shop in Tadepalli : వైసీపీ అధికారంలోకి వచ్చాక బెల్టు షాపులు రద్దు చేశామంటూ సీఎం జగన్ మొదలుకుని.. ఆ పార్టీ నాయకుల వరకూ ఊదరగొడుతుంటే ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలో ఓ వాలంటీర్ ఏకంగా బెల్టు షాపు నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది.
సీఎం జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లిలో ఓ వాలంటీర్ బెల్ట్ షాప్ నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న సచివాలయంలో పనిచేసే వాలంటీర్ శ్రీనివాస్.. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో గ్రూప్‌లు ఏర్పాటు చేసి మద్యాన్ని డోర్ డెలివరీ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వాలంటీర్ శ్రీనివాస్, అతన సహాయకుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వీరి వద్ద నుంచి 130 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. వాలంటీర్ ముసుగులో అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న తర్వాతే దాడి చేసి శ్రీనివాస్‌ను పట్టుకున్నామని ఎస్సై రమేష్ తెలిపారు.