విశాఖ రుషికొండ బీచ్ కఠిన నిబంధనలను చవిచూడక తప్పదా?
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 1, 2023, 7:33 PM IST
Visakha Rushikonda Beach, Structures Updates: ఆంధ్రప్రదేశ్‌లో అందమైన నగరాల్లో విశాఖపట్టణం ఒకటి. సుదీర్ఘమైన సముద్రతీరం కలిగి ఉండడంతో 'సిటీ ఆఫ్ డెస్టినీ'గా పిలుస్తుంటారు. నగరంలోని ఒక్కో బీచ్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. విశాఖపట్నం వెళ్లినవారు రుషికొండ బీచ్‌ను సందర్శించకుండా ఉండలేరు. అటువంటి రుషికొండ బీచ్.. ఇప్పుడు కఠిన నిబంధనలు చవి చూడనుంది. రాజధాని తరలింపులో భాగంగా రుషికొండపై భవనాలను ముఖ్యమంత్రి ట్రాన్సిట్ కార్యాలయంగా వాడాలని నిర్ణయించడంతో.. పనులన్నీ చురుగ్గా సాగుతున్నాయి.
HC Orders to Central Forest Environment Department: మరోవైపు రుషికొండపై కట్టిన నిర్మాణాలు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించాయని.. ఉన్నతస్ధాయి కమిటీ న్యాయస్ధానానికి నివేదికను సమర్పించింది. దాంతో మూడు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని.. కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు) ఆదేశించింది. ఈ నేపథ్యంలో రుషికొండ బీచ్‌ను సందర్శించేందుకు విచ్చేస్తున్న వందలాది మంది పర్యాటకుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా హైకోర్టు ఆదేశాలు చర్చనీయాంశంగా మారాయి. రుషికొండ బీచ్, నిర్మాణాలపై తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తున్నారు. మరి ఆలస్యంగా చేయకుండా ఆ వివరాలెంటో తెలుసుకుందామా..