రాత్రి వేళల్లో విశాఖ విమానాశ్రయం మూసివేత - ప్రయాణికుల భద్రతే ముఖ్యమన్న ఈఎన్​సీ చీఫ్

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 9, 2023, 7:41 PM IST

Visakha Airport Closed Night Time From November 15:  విశాఖపట్టణం విమానాశ్రయాన్ని ఈ నెల 15వ తేదీ నుంచి రాత్రిపూట మూసివేస్తున్నట్లు ఈఎన్‌సీ చీఫ్‌ రాజేష్ పెంధార్కర్‌ తెలిపారు. రన్‌వే పునరుద్ధరణ పనుల నిమిత్తం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 15 నుంచి దాదాపు 4 నుంచి 6 నెలల పాటు రాత్రిపూట విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఉదయం వేళలోనే తమ ప్రయాణాలకు ప్రణాళికలు వేసుకోవాలని ఆయన సూచించారు.

BJP MP GVL Talks With ENC Chief: విశాఖ విమానాశ్రయాన్ని రాత్రిపూట మూసివేయడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు నౌకాదళ అధికారులతో చర్చలు జరిపారు. రాత్రిపూట విమానాశ్రయాన్ని మూసివేయవద్దంటూ అధికారులు కోరారు. అయితే, రన్‌వే పనుల కోసం రాత్రిపూట విమానాశ్రయాన్ని మూసివేయక తప్పదని ఈఎన్‌సీ చీఫ్ వెల్లడించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈఎన్‌సీ చీఫ్‌ ఎంపీకి వివరించారు. అయితే, పగటిపూట సర్వీసులను పెంచుకునేందుకు మాత్రం ఈఎన్‌సీ చీఫ్‌ సుముఖత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.