Farmer Pulling 125 Sacks of Sorghum with Bullock Carts: గతంలో రైతులకు ఎడ్ల బండ్లే ప్రధాన రవాణా సాధనంగా ఉండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా ఎంత దూరమైనా ఎడ్ల బండి మీదే ప్రయాణం సాగించేవారు. కానీ, మారుతున్న కాలానికి అనుగుణంగా ఎన్నో రకాల వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, నేటికీ చాలా మంది రైతులు పల్లెల్లో తమ వడ్ల బస్తాలు ఇంటికి చేర్చడానికి, అలాగే ఎరువుల బస్తాలు పొలానికి తరలించడానికి ఎడ్ల బండ్లనే ఉపయోగిస్తున్నారు. అలానే అనంతపురం జిల్లాలో ఓ రైతు తన వద్ద ఉన్న జొన్న బస్తాలను తరలించడానికి ఒక చక్కటి ఉపాయం చేశారు. ఈ ఉపాయం ద్వారా ఒకేసారి అన్ని బస్తాలను ఇంటికి తరలించారు.
జిల్లాలోని విడపనకల్లులో బోయ అశోక్ అనే రైతు 125 జొన్న బస్తాలను ఐదు ఎడ్లబళ్లలో వేసి లాగించారు. బండెనక బండి కట్టి ఒక ఎద్దుతో బళ్లను నడిపించారు. సుమారు 2 కిలోమీటర్ల వరకు బండిని నడిపారు. అయితే ఐదు ఎడ్ల బండ్లను ఒకేసారి లాగుతున్న దృశ్యాన్ని చూడడానికి హావళిగ పరిసర ప్రాంతాల్లో ఉన్న చాలా మంది గ్రామ ప్రజలు తరలి వచ్చారు. ఒకవైపు ఎద్దు, మరొవైపు మనుషుల ఐదు బండ్లను లాగుతున్న దృశ్యాన్ని చూసి ఆనందంతో కేకలు వేస్తూ ఉత్సాహంగా బండి వెనుక తరలి వెళ్లారు.
ఇద్దరు గురుకుల విద్యార్థులు కిడ్నాప్ - ఆడుకుంటుండగా ఎత్తుకెళ్లిన దుండగులు
అయితే కొద్ది రోజుల క్రితం ఇదే జిల్లాలో పూజారి శీన అనే రైతు ఇలానే చేశాడు. ఈయన 101 జొన్న బస్తాలను ఐదు ఎడ్లబండ్లలో వేసి బండెనక బండి కట్టి ఒక వైపు ఎద్దును కట్టి, మరోవైపు మనుషులతో లాగించారు. ఎద్దుల పెంపకంపై ఆయనకు ఉన్న ఉత్సాహం, ప్రేమతో ఎద్దుతో మూడు కిలోమీటర్ల మేర లాగించారు.
సోషల్ మీడియాలో వైరల్: ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్లు రైతు చక్కటి ఉపాయం చేశాడని అభినందిస్తున్నారు. మరికొందరు రైతు బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి, అనే సాంగ్‌ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లు ఉన్నాడని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఈయన తన టాలెంట్‌తో ఎంతో సమయం ఆదా చేసుకున్నారని అంటున్నారు.
బండెనక బండి కట్టి! - ఎద్దు లేకుండా ఐదు బండ్లు లాగిన రైతులు
పిడికెడు బియ్యం ఆలోచన - అభాగ్యుల ఆకలి తీరుస్తున్న సత్యసాయి సమితి